4వ.డివిజన్‌లో శిథిల రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు…
మేయర్‌కు వినతిపత్రం అందజేసిన కార్పోరేటర్ కంకణాల మౌనిక-రాజు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ స్పెక్ట్రా స్కూల్ లైన్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు శనివారం నగర మేయర్ మహంకాళి స్వామికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ, స్పెక్ట్రా స్కూల్ లైన్ ప్రాంతంలోని రహదారి పూర్తిగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదాల ముప్పు పెరిగిందని, ప్రజల భద్రత దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన నగర మేయర్ మహంకాళి స్వామి సమస్యపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో రోడ్డును పరిశీలించి అత్యవసరంగా మరమ్మతు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మేయర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, డివిజన్‌లోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

