త్రికోటేశ్వర స్వామి ఆలయానికి బస్సులు లేకపోవడంతో మండి పడుతున్నా భక్తులు

Sakshitha news

త్రికోటేశ్వర స్వామి ఆలయానికి బస్సులు లేకపోవడంతో మండి పడుతున్నా భక్తులు.

సాక్షిత చిలకలూరిపేట: త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అలాంటి ప్రసిద్ధిగాంచిన త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడం దురదృష్టకరమును పలువురు భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఒకటి, రెండు బస్సులు ఉన్నప్పటికీ కాలక్రమేణ తీసివేశారు. దీంతో భక్తులు ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నరసరావుపేట, చిలకలూరిపేట నుండి భక్తులకు ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.