రూ 10 కోట్ల 90 లక్షలతో దూలపల్లి–జీడిమెట్ల పారిశ్రామిక వాడ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ దూలపల్లి గ్రామం నుంచి జీడిమెట్ల పారిశ్రామిక వాడకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు.
నాలుగు నెలల క్రితం స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పూర్తిగా దెబ్బతిన్న ఈ రహదారిని కూన శ్రీశైలం గౌడ్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రహదారి నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు సంబంధిత మంత్రులకు లేఖలు అందజేశారు.
ఆయన చేసిన నిరంతర కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ రహదారి నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేసి, రూ.10.90లక్షలు నిధులను విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ,10 సంవత్సరాల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఏలాంటివి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించకుండా ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అన్నారు, ఈ రోడ్డు ధ్వంసమైననేపథంలో అనేకమంది ఈ రహదారీ గుండా ప్రయాణించే ఉద్యోగుల ఇతర స్థానిక ప్రజలు ప్రమాదాలకు గురయ్యారని విమర్శించారు,అదేవిధంగా రహదారి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ రహదారి పూర్తయితే దూలపల్లి గ్రామ ప్రజలతో పాటు జీడిమెట్ల పారిశ్రామిక వాడకు నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, వాహనదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు..
రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు గతంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా ఐఏఎస్ కి మరియు ప్రస్తుత సీఎంసి కమిషనర్ సృజన ఐఏఎస్ కి శ్రీశైలం గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు….
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, భాస్కర్ గౌడ్, మోహన్ రావు, కావలి గోపాల్,నాగేశ్వరరావు, రంగారావు,చాంద్ పాషా, మల్లేష్, వెంకటేశ్, అశోక్,సుదర్శన్ రెడ్డి, నవీన్, ఉపేందర్రెడ్డి, ఖదీర్, మరియు స్థానిక అయ్యప్ప కాలనీ వాసులు కార్యకర్తలు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
