కౌన్సిల్లో ప్రజా సమస్యల గొంతుకైనా సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశం బుధవారం జరగగా, ఈ సమావేశంలో సిపిఐ ఫ్లోర్ లీడర్ 41వ. డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య హాజరై ప్రజా సమస్యలను కౌన్సిల్లో సిపిఐ, ప్రజల పక్షాన వినిపించడం జరిగింది.
41వ. డివిజన్లో ఉన్న నాలా పూడికతీత సంబంధించి ప్రజా పాలనలో భాగంగా రానందున తొందరలోనే 41వ. డివిజన్ సందర్శనగ వచ్చి నాలా పూడికతీతకు శానిటేషన్ విభాగాన్ని ఆదేశించాలని, అలాగే డివిజన్లో ఉన్న యూజీడీల మరమ్మత్తుల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈరోజు వరకు కార్మికులకు జీతాలు ఇంకా పడలేదని ప్రశ్నించగా, ఈరోజు కార్మికులకు జీతాలు వేయడం జరిగిందని మేయర్ సమాధానం చెప్పడం జరిగింది. వాస్తవానికి 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి అభివృద్ధి పనులు జరుగుతున్నయని చెప్తున్న కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామని, అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు డిపాజిట్ చేయాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులను అభివృద్ధికి మళ్ళించారని సూర్య దుయ్యబట్టారు.
అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే ఒక్క రూపాయి అంత్యక్రియలు ప్రారంభించాలని, దాంట్లో డప్పు కూడా చేర్చాలని అలాగే వైకుంఠ రథాలు సాధ్యమైనంతవరకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు.
ఈ.ఈ.ఎస్.ఎల్ కింద పనిచేస్తున్న ఆరుగురు ఎలక్ట్రీషియన్లను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని మధ్యతరగతి చెందిన కుటుంబాలు ఒకేసారి ఉద్యోగం తీసివేస్తే ఇబ్బందులకు గురవుతారని, ఇప్పటికే గత నాలుగు నెలలుగా జీతాలు లేకపోయినా వారు సేవలందిస్తున్నందున వారిని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరగా, మేయర్ కమిషనర్ కి ఆ విషయమై చూడాలని ఆదేశించారు.
కార్పొరేషన్ ప్రాంతంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని దీనిపైన సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని సూర్య కోరారు. గత పాలకవర్గానికి సంబంధించి వాహనాల గోల్మాల్ మనం చూసామని కనీసం ఈ పాలకవర్గమైన పాత వాహనాలకు సంబంధించి ఒక అంచనాల కమిటీని వేసి వాటికి కావాల్సిన రిపేర్లు ఏమేమి ఉన్నాయి, ఎన్ని నిధులు అయితే ఆ వాహనాలన్నీ అందుబాటులోకి వస్తాయి అని ఒక రిపోర్ట్ తయారు చేసి, ప్రతి వాహనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మేయర్ చర్యలు తీసుకోవాలని కోరగా, వారు కచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే 1998 2004 తర్వాత గోదావరిఖని ప్రాంతంలో ఇంటి పనులకు సంబంధించి రి అసెస్మెంట్ జరగలేదు నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కార్పొరేషన్కు ఎంతైనా ఉన్నదని, కనుక కార్పొరేషన్ ప్రాంతాన్ని మరోసారి అసెస్మెంట్ చేసి ఇంటి పన్నులు సడలించడంతోపాటు మేకల మండి లాంటి వ్యాపార కేంద్రాలను మున్సిపల్ తై బజార్ కిందికి తీసుకురావడం ద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మేయర్ కి సూచన చేయడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY