ప్రజలకు ఉన్న సోయి ప్రజాప్రతినిధులకు లేదు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
హెచ్ఎంటి ఖాళీ స్థలంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష నేడు మూడవరోజు స్థానిక మహిళా సమైక్య నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది.
ఈ రిలే నిరాహార దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహే రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం లు ప్రారంభిస్తూ హెచ్ఎంటి ఖాళీ స్థలంలో బస్ డిపో మరియు ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్షలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని దానికి నిదర్శనమే ఈ నిరాహార దీక్షలో మహిళలు కూర్చోవడం మంచి పరిణామం అని అన్నారు.
ఇలా ప్రజలందరూ ఏకమై బస్ డిపో మరియు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించేంతవరకు పోరాటం చేస్తే ఖచ్చితంగా జగద్గిరిగుట్టలో బస్ డిపో మరియు ప్రభుత్వం ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవచ్చని, ఆల్రెడీ ఈ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఐ నిర్వహించే పోరాటంలో కలిసి రావాలని అది మన ప్రాంతానికి ప్రజలకు చాలా ఉపయోగకరమని దీన్ని రానున్న రోజుల్లో ప్రజలకు అందరికీ తెలియజేసి ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి ఈ పోరాటాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు.
ఈ నిరాహార దీక్షలో మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, మాజీ కౌన్సిలర్ చంద్రమ్మ, మహిళా సమైక్య మండల నాయకురాలు సత్యవతి, భాగ్యలక్ష్మి, పద్మ,సోమేశ్వరి,దీపిక, సుజాత, పార్వతమ్మ, అమృతమ్మ, దీప,ఉమా, సంధ్య, సుజాత, సౌమ్యశ్రీ తదితరులు నిరాహార దీక్షలో కూర్చున్నారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు వి హరినాథ్ రావు, రాములు శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నరసయ్య, సిపిఐ నాయకులు యాదయ్య, ఇమామ్, నారాయణ,బాబు, యువజన నాయకులు కీర్తి, దేవానందం తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
