మహాత్మాగాంధీ నగర్ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ కాలనీ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ నగర్ కాలనీలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీ లో మంజీరా వాటర్ ప్రెషర్ లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ మహిళలు కార్పొరేటర్ కి తెలియచేయగా కార్పొరేటర్ సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి త్రాగు నీటి ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పాదయాత్ర లో భాగంగా ఎల్లమ్మబండ ప్రభుత్వ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవలు మరియు సదుపాయల గురించి రోగులను మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి, వెంకట్ యాదవ్, గోపాల్, గుడ్ల శ్రీనివాస్, పోశెట్టిగౌడ్, రామస్వామి, శివదుర్గ రెడ్డి, సుబ్రహ్మణ్యం, వెంకట్, ప్రభు యాదవ్, సతీష్, రాజు నాయక్, మల్లేష్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, రవీందర్, ఖలీమ్.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

