నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
జాతీయ నులిపురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నులి పురుగులు నివారణ కొరకు ఉచిత మందులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా ఎల్లమ్మబండ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మరియు డాక్టర్లు మాట్లాడుతూ నులి పురుగులు చాలా ప్రమాదకరమైనవి, పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం, మల విసర్జన ద్వారా నులి పురుగులు వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని అన్నారు. ఈ నులి పురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమం అన్నారు. అలాగే భోజనం చేసే ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మరియు పరిశుభ్రమైన నీటిని తాగాలి అని అన్నారు. పిల్లలందరూ వైద్య నిపుణులు మరియు ఉపాధ్యాయులు చెప్పినవి శ్రద్ధగా విని ఆరోగ్యంగా ఉండలని తెలియచేసారు. కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, గుడ్ల శ్రీనివాస్, డాక్టర్లు డి.మౌనిక, సుజిలీల, కృష్ణవేణి, సంతోషి, రాజ్యలక్ష్మి, శిశిరేఖ, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
