కేటీఆర్ పై జిల్లాఎస్పీ కి పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
*సాక్షిత వనపర్తి :
గ్రూప్ – 1 అభ్యర్థులపై నిందలు మోపి వారి జీవితాల్లో చిచ్చుపెట్టిన కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వనపర్తి ఎస్పీరావుల గిరిధర కి ఫిర్యాదు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ
రాష్ట్రంలోని 570 మంది గ్రూప్ – 1 అభ్యర్థులు సంబంధిత అధికారులకు రూ.3 నుంచి 5 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని నిరాదార ఆరోపణలు చేసి ర్యాంకులు సాధించిన అభ్యర్థుల జీవితాల్లో, కుటుంబాల్లో చిచ్చుపెట్టిన కేటీఆర్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
నిద్రాహారాలు మాని రేయింబవళ్లు కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వారన్నారు
రాజకీయ లబ్ధికోసం ఎలాంటి దారుణాల కైనా ఒడిగట్టె ఇలాంటి నాయకులు సమాజానికి ఎంతో ప్రమాదకరమని వారు పేర్కొన్నారు
ఈ సందర్భంగా వారు కేటీఆర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం చారి, శరవంద, ఎల్ఐసి కృష్ణ, యాదగిరి, SLN రమేష్ తదితరులు పాల్గొన్నారు
