కొలన్ హన్మంత్ ప్యానెల్ ఘన విజయం

Sakshitha news

కొలన్ హన్మంత్ ప్యానెల్ ఘన విజయం ||

సాక్షిత : జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10-సీ లోని విజయ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ కమిటీ (ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ) ఎన్నికలు కాలనీలోని కల్చరల్ సెంటర్ హాల్ లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కొలన్ హన్మంత్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆయన ప్యానెల్ తరఫున పోటీ చేసిన 11 మందిలో 10 మంది విజయం సాధించారు. కొలన్ ప్యానెల్లో ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీ లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విజయం సాధించారు. మాజీ మంత్రి రెడ్యానాయక్పై ఆయన గెలుపొందారు. విమెన్ క్యాటగిరీ వి. సీతామాధురి, ఓపెన్ క్యాటగిరీ పి.గాయత్రీ లత, కే ముత్యంరెడ్డి, పి.ర వీంద్ర, వై.రంగారావు, ఎం.సురేందర్రెడ్డి, ఎన్.సూర్యప్రకాశరావు, ఏ.సందీప్రెడ్డి, కొలన్ హన్మంత్ రెడ్డి గెలుపొందారు. రంజిత్రెడ్డి ప్యానెల్ లో అనుపమరెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఇదిలా ఉండగా మొత్తం 304 ఓట్లకు గాను 227 ఓట్లు పోలయ్యాయి. రంజిత్ రెడ్డి ప్యానెల్, హన్మంత్ రెడ్డి ప్యానెల్ ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. మేనేజింగ్ కమిటీలో 11 మంది కార్యవర్గ సభ్యులకు గాను ఈ ఎన్ని కలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారంతా మరో సమావేశం ఏర్పాటు చేసుకుని చీఫ్ అడ్వైసర్ గా(నగర్ కర్నూల్ ఎంపీ) మల్లు రవి, అధ్యక్షులు గా కొలన్ హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్ సూర్య ప్రకాష్ రావు, జనరల్ సెక్రెటరీగా ఏ సందీప్ రెడ్డి, కోశాధికారిగా వి. సీతామాధురి మరియు కమిటీ మెంబర్లగా కె. ముత్యం రెడ్డి, పి. రవీంద్ర, ఏం. సురేందర్ రెడ్డి, పి. గాయత్రీలత, సి. అనుపమ రెడ్డి ను ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు