తారు రోడ్డు పనులను ప్రారంభించిన చిత్తూరు ఎంపీ
** 3.67 లక్షలతో బి.టీ రోడ్డు నిర్మాణం
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది….చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని సాంబయ్య కండ్రిగ – కట్టమంచి రహదారులను 3.67 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ బి.టీ.రోడ్ల పనులను
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ భూమి పూజ చేసి, అనంతరం హిటాచ్చి డ్రైవర్ గా మారి స్వయంగా పనులను ప్రారంభించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అతుకులు,గతుకులమయమైన సాంబయ్య కండ్రిగ – కట్టమంచి రహదారి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపామన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతకు, చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ బి.టీ రోడ్ల నిర్మాణం పూర్తయితే చిత్తూరు నగరం నూతన హంగులను సంతరించుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న స్థానిక ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఎంపీ, ఎమ్మెల్యే అన్నారు. కాగా సాంబయ్య కండ్రిగ – కట్టమంచి రహదార్ల నిర్మాణ పనులకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ భూమి పూజ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, “చుడా” ఛైర్పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి, ఎమ్మెల్యే సోదరులు జీవన్ , కార్పొరేటర్ అశోక్, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
