లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను

Sakshitha news

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
……………………………..
సాక్షిత :(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) పలువురు పేదలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ని మంజూరు చేయించి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 125 డివిజన్ గాజులరామారం వాసులు లాకోటి విజేందర్ కి రూ -60,000/-, ముహమ్మద్ ఇలియాస్ కి రూ 18,500/-, యాస్మిన్ సుల్తానా కి రూ . 20,000/-, 130 డివిజన్ అంజి రెడ్డి బస్తి వాసులు తెల్ల రామకృష్ణ కి రూ . 27,000/-, 132 డివిజన్ రంగారెడ్డి వాసులు కావడి బల్ రెడ్డి కి రూ . 30,000/- CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం రెడ్డి, సంజీవ రెడ్డి, గాగిలాపూర్ మాజీ సర్పంచ్ బల్ రాజ్, డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్, గణేష్, సోమన్న శ్రీధర్ రెడ్డి, గఫ్ఫార్, ఎండి నయీమ్, రహీమ్, ఖలీమ్, హరి కిరణ్, కరణ్, నర్సింహా రెడ్డి, అజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.