అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య

Sakshitha news

చేవెళ్ల నియోజకవర్గం:-

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

మొయినాబాద్ మునిసిపాలిటీ చిలుకూరు, హిమాయత్ నగర్ మరియు మొయినాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిబోయే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అర్హులైన ప్రతిపేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుందన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” పని చేస్తున్నారని తెలిపారు.

అనంతరం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు.