చందిప్ప ఉత్తమ పట్టు రైతు దోసాడ శేఖర్ రెడ్డికి జిల్లా అవార్డు
శంకర్‌పల్లి: సాక్షిత): శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన రైతు దోసాడ శేఖర్ రెడ్డి పట్టు సాగు చేస్తూ లాభాలు ఆర్జించి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. కేంద్ర పట్టు పరిశోధన సంస్థ అధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా లోని బోదాన్ పోచంపల్లిలో జరిగిన పట్టు కృషి మేళాలో రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్తమ పట్టు రైతు దోసాడ శేఖర్ రెడ్డికి సిల్క్ బోర్డు సభ్యులు డా. వినోద్ కుమార్, డా. రాఘవేందర్ లు జిల్లా అవార్డును అందజేసి సత్కరించారు. రైతు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో సరైన లాభాలు లేకపోవడంతో గత తొమ్మిది సంవత్సరాల క్రితం పట్టు సాగు చేశానన్నారు. సిరికల్చర్ ఫామ్ ను ఏర్పాటు చేసుకొని గత మూడు సంవత్సరాల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లు రైతు శేఖర్ రెడ్డి తెలియజేశారు.
వికారాబాద్, పరిగి, కొడంగల్ నుంచి వచ్చిన నూతన రైతులకు శేఖర్ రెడ్డి మల్బరి పట్టు పురుగుల పెంపకం గురించి సలహాలు సూచనలు చేశారు. శేఖర్ రెడ్డికి ఉత్తమ అవార్డు రావడం పట్ల గ్రామ రైతులే గాక మండలానికి చెందిన రైతులు పలువురు అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY