“ఫ్యాషన్ ఫెస్ట్ సీజన్ 4” బిగ్గెస్ట్ ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Sakshitha news

“ఫ్యాషన్ ఫెస్ట్ సీజన్ 4” బిగ్గెస్ట్ ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు…

ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కె.వి.ఆర్ కన్వెన్షన్ నందు శ్రీవాణి రెడ్డి, డాక్టర్ సౌమ్య రెడ్డి ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ఫ్యాషన్ ఫెస్ట్ – ఫ్యాషన్ 4” బిగ్గెస్ట్ ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సరికొత్త డిజైన్లతో ఫ్యాషన్, జువెలరీ వంటి ఉత్పత్తులను ఒకే చోట ఏర్పాటుచేస్తూ వినియోగదారులకు అందజేస్తూ ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం మంచి పరిణామన్నారు. పెద్దలు, మహిళలు, యువత ఈ ఎగ్జిబిషన్ ను వీక్షించి వారి ఉత్పత్తులను వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, నాయకులు కిట్టు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.