చిగోరా” సేవాకేంద్రంలో భోగరాజు పట్టాభి జయంతి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి దక్షిణమాడ వీధిలోగల “చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో” ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 145వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళర్పించారు.
ఈ సందర్భంగా సమాజానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన సేవలను స్మరించుకుని, అమర్ రహే భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు, టీటీడీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రాయలసీమ రంగస్థలి చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పూర్వపు మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
