రిజర్వేషన్ల సీలింగ్ 50% ఎత్తివేతపై బి సి ఎఫ్ హర్షం

Sakshitha news

రిజర్వేషన్ల సీలింగ్ 50% ఎత్తివేతపై బి సి ఎఫ్ హర్షం

రాజకీయ పార్టీలు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తమ చిత్తశుద్ధిని చాటు కోవాలని డిమాండ్
ఓట్ల సమస్య తలెత్తకుండా ఎన్నికలు జ రపాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి…………… బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగమోని చెన్న రాములు
.

సాక్షిత వనపర్తి :
బిసిల రిజర్వేషన్లపై 50% సీలింగ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంపై బిసిఎఫ్ హర్షం వ్యక్తం శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ
ప్రభుత్వాన్ది చారిత్రకమైన సాహసోపేతమైన నిర్ణయం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలోని బిసి సోదరులంతా అలర్టై తమ తమ గ్రామాలలో ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినట్లుగా ఓట్ల గల్లంతు మరియు దొంగ ఓట్ల చేర్పింపులు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముందస్తు హెచ్చరిక చేయడం జరిగింది . రాష్ట్రంలో శాంతియుత సమస్యలు తలెత్తే చోట రిగ్గింగ్ జరిగేటువంటి పోలింగ్ బూత్ లను ముందే పసిగట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి . ఒకవేళ 42 శాతం రిజర్వేషన్ ఏదైనా కోర్టు తీర్పుల కారణంగా ఆగిపోతే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లను ఇచ్చి ప్రోత్సహించాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో స్థానిక సంస్థలకు ఎన్నికలు తక్షణమే జరగాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగపరమైనటువంటి సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి నిధులు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు అనివార్యంగా వెంటనే నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు 42 శాతం అభ్యర్థులను తప్పనిసరిగా పాటించి నిలబెట్టి గెలిపించాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉందని అప్పుడే బీసీలపై చిత్తశుద్ధిని నిరూపించుకున్న వారు అవుతారని సందర్భంగా చెన్నరాములు అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.