బాచుపల్లి పోలీసుల కీలక ఆపరేషన్…
మేడ్చల్ జిల్లా : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు ఆటో మొబైల్ నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 10 దొంగిలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
బాచుపల్లి, పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, ఆల్వాల్, కూకట్‌పల్లి, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో జరిగిన బైక్ చోరీ కేసులను ఛేదించిన పోలీసులు… ఇద్దరు మేజర్లు, ఇద్దరు సీసీఎల్‌లను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మరియు చెడు అలవాట్లకు బానిసై డబ్బుల కోసం ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
“10 బైక్స్ స్వాధీనం, నలుగురు అరెస్ట్ “
ఈ ఆపరేషన్‌ను బాచుపల్లి ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారని ఏ సి పి తెలిపారు .
బైట్ : బాల గంగిరెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసిపి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
