రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బచ్చు రామును సన్మానించిన…….. బిజెపి రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి
సాక్షిత వనపర్తి :
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బచ్చు రామును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మెంటం పల్లి పురుషోత్తం రెడ్డి బుధవారము బచ్చురామును శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులుగా ఆర్యవైశ్యులకు ఎంతో సేవ చేశారని బిజెపి పార్టీ నాయకులుగా పట్టణంలోని పలు సమస్యలపై పోరాటాలు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ లాంటి పలు పథకాల గురించి వేల మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలు వినిపించడం అలాగే ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకు డాక్టరేట్ అవార్డు కూడా లభించిందని రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందించి బిజెపిని బలోపేతం చేయాలని మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ చిత్తారి ప్రభాకర్ మాజీ అధ్యక్షుడు మండల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
