మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మోతే పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

Sakshitha news

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మోతే పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

సాక్షిత మోతె : మండల కేంద్రంలోని మోతే కేజీబీవీ (KGBV) పాఠశాల విద్యార్థినిలతో కలిసి మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఎస్ఐ (SIP) నేతృత్వంలో కేజీబీవీపాఠశాల నుండి మోతె సెంటర్ వరకు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మోతే పోలీస్ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు అలవాట్లు జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయో విద్యార్థులకు వివరించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు.
ఈ అవగాహన ర్యాలీలో మోతే పోలీస్ సిబ్బంది, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Scroll to Top