లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం పై అవగాహన
** హాజరైన జిల్లా కలెక్టర్…. తుడ చైర్మన్ డాలర్స్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ కు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అలాగే తుడా వైస్ చైర్మన్ అండ్ జాయింట్ కలెక్టర్ శుభం బాన్సల్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లేఅవుట్ రెగ్యులైజేషన్ పథకం లక్ష్యాలు, నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియ, టెక్నికల్ పర్సన్స్ పాత్ర పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టెక్నికల్ పర్సన్స్ లేఅవుట్ దారులకు ఖచ్చితమైన మార్గదర్శనం ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, నిబంధనల ప్రకారం మ్యాపులు తయారు చేయడం, అప్లికేషన్లను సమర్ధవంతంగా ప్రాసెస్ చేయడం గురించి అధికారులు వివరించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో భాగస్వాములు కావాలన్నారు. అనధికార లేఔట్స్, అక్రమ ఫ్లాట్స్ రెగ్యులైజేషన్ కోసం ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, “పట్టణాభివృద్ధిలో టెక్నికల్ పర్సన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు చట్టబద్ధమైన భూమి హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం విజయవంతంగా అమలు చేయడానికి సహకరించాలన్నారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో అక్రమ లేఔట్స్ అధికమవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి తుడా అప్రూవల్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, తుడా అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
