మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ గా విచ్చేసిన అంజలి నిమ్బల్కర్

Sakshitha news

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ గా విచ్చేసిన అంజలి నిమ్బల్కర్ కి స్వాగతం పలికిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి *

ఏఐసీసీ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో నూతన డిసిసి అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ నుండి శ్రీమతి డాక్టర్ అంజలి నింబాల్కర్ కి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐసీసీ ఆబ్సర్వర్ గా డీసీసీ కార్యాలయానికి విచ్చేసినందున స్వాగతం పలికిన * జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి * మరియు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి *. అనంతరం డిసిసి అధ్యక్షుల నియామకం కోసం బయోడేటాను పరిశీలనకు తీసుకోవడం జరిగింది మరియు జిల్లా అగ్ర నాయకులతో ముఖా ముఖి కార్యక్రమంలో అంజలి నిమ్బల్కర్ పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజర్లు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , నియోజకవర్గ ఇంచార్జులు పి. విజయ రెడ్డి , మైనంపల్లి హనుమంత్ రావు , తోటకూర వజ్రేష్ యాదవ్ , ఎం. పరమేశ్వర్ రెడ్డి , బండి రమేష్ , మాజీ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ , మలిపెద్ది సుధీర్ రెడ్డి , టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం , టిపిసిసి జనరల్ సెక్రెటరీ పీసరి మైపాల్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి .