అంగన్వాడిలోనే భవిష్యత్తు బలమైన పునాది…
జవహర్ నగర్‌లో ప్రీ స్కూల్ చిన్నారుల గ్రాజువేషన్ వేడుకలు ఘనంగా….
….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని:
రామగుండం ప్రాజెక్టు పరిధిలోని జవహర్ నగర్ సెక్టార్‌లోని 9 అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం పూర్వ ప్రాథమిక విద్య అభ్యసించిన చిన్నారుల కోసం గ్రాజువేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, పాతిపెల్లి కావ్య, దొంత శ్రీనివాస్, కారంగుల రమ్య మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి దశలోనే పడుతుందని పేర్కొన్నారు. స్కూల్ రెడీనెస్ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, విద్యపై ఆసక్తి మరింతగా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
రామగుండం మున్సిపల్ పరిధిలోని అంగన్వాడీ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ అలేఖ్య పటేల్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య క్రమబద్ధంగా అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా అంగన్వాడీలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దశలో పిల్లల సామాజిక, శారీరక, మానసిక, భాషా, మేధో అభివృద్ధికి అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు షిరీన్, లిటిల్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY