రైల్వేలో “అమృత్ సంభాషణ”
** తిరుపతి రైల్వే డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: భారత రైల్వే – అమృత్ భారత్ స్టేషన్ పథకం “అమృత్ సంభాషణ” – ప్రజల స్వరమే అభివృద్ధి శక్తి అనే అంశం పై గురువారం (నేడు) తిరుపతి రైల్వే స్టేషన్ వీఐపీ హాల్లో నిర్వహిస్తామని స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు.
అమృత కాల్ దృష్టికోణాన్ని అనుసరించి ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన పంచ ప్రాణాల సూత్రాన్ని మార్గదర్శకంగా తీసుకొని, రైల్వే మంత్రిత్వ శాఖ స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కింద ఒక కొత్త పౌర కేంద్రిత కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. తిరుపతి స్టేషన్ అభివృద్ధి యాత్రలో మీ అభిప్రాయాలు, సూచనలు అత్యంత ముఖ్యమైనవి.
ఈ లక్ష్యంతో గురువారం నిర్వహించబడుతున్న “అమృత్ సంభాషణ” కార్యక్రమానికి హాజరు కావాలని తిరుపతి రైల్వే అధికారులు కోరారు .

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
