అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత బొచ్చు శంకర్‌కు ఘన సన్మానం….
చిన్ననాటి మిత్రుడి ఘనతపై మిత్రబృందం హర్షం.. సామాజిక సేవలను కొనియాడిన స్నేహితులు…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : సామాజిక ఉద్యమకారుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత బొచ్చు శంకర్కు చిన్ననాటి మిత్రబృందం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.
8 ఇంక్లైన్ కాలనీలోని పోతన కాలనీలో గుడ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మందమరి కార్మెల్ హైస్కూల్‌కు చెందిన 1993 బ్యాచ్ మిత్రబృందం బొచ్చు శంకర్, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజ సేవకు తన వంతు కృషి చేస్తున్న బొచ్చు శంకర్‌కు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
చిన్ననాటి మిత్రుడు జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకుని సామాజిక సేవా రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మందమరి కార్మెల్ హైస్కూల్ 1993 బ్యాచ్ మిత్రులు చింతల వేణు, తోట రమేష్, బాణాల రాజశేఖర్, జీడి శ్రీనివాస్, కరుణ, కవిత, స్వర్ణలత, రమాదేవి, రాజేశ్వరి, రొడ్డ బాబు, పాముల శేషు, కమటం రామస్వామి, పేరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని బొచ్చు శంకర్‌ను ఘనంగా సన్మానించారు.


