కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి(పార్ట్), వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ , కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగింది , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,
నూతనంగా ఏర్పడిన ఆల్విన్ సర్కిల్ మరియు మాదాపూర్ సర్కిల్ కార్యాలయంల కొరకు నూతన భవనాలు నిర్మించేందుకు స్థలాలను పరిశీలించడం జరిగినది అని, స్థలాల కేటాయింపు మరియు భవనాల నిర్మాణం కొరకు తీసుకోవాల్సిన విధివిధానాలపై చర్చించడం జరిగినది అని, కొత్త సర్కిల్ కార్యాలయంల భవనాలు త్వరితగతిన నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని , ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికి ఆమోదయోగ్యమైన సర్కిల్ కార్యలయంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే విధముగా కృషి చేయాలని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. అసంపూర్తిగా మిగిలోపోయిన నాలల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికి అందుబాటులోకి తీసుకురావలని,అసంపూర్తిగా మిగిలిపోయిన పరికి చెరువు అలుగు నుండి ధరణి నగర్ నగర్ నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అదేవిధంగా చెరువుల సుందరికరణలో భాగంగా గుర్రపు డెక్కను తొలగించాలని, హైదర్ నగర్ అలీ తలబ్ చెరువు, అంబిర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, పరికి చేయువు లలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ను తొలగించాలని, చెరువుల సుందరీ కరణ పనులలో వేగం పెంచాలని, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE చిన్నా రెడ్డి, EE గోవర్ధన్, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
