ప్రజాసభకు సర్వసిద్ధం – ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
*సాక్షిత : గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ ప్రజాసభకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు పాల్గొననున్న నేపథ్యంలో, సభా స్థలాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ స్వయంగా పరిశీలించారు.
వేదిక ఏర్పాటు నుంచి ప్రజల సౌకర్యాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించిన ఎమ్మెల్యే, కార్యక్రమం విజయవంతం కావాలంటే సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ శ్రీమతి జల్దా అరుణ శ్రీ , సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
