శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగానికి పూజలు చేసిన అఖండ – 2 చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను
సాక్షిత శంకర్‌పల్లి: మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆకుపచ్చ రంగు గల శివలింగానికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. 11వ శతాబ్దంలో చాణుక్య రాజులు ఈ శివలింగాన్ని ప్రతిష్టించడం జరిగిందని, అయితే చందిప్ప గ్రామస్తులు ఆ శివలింగాన్ని భద్రంగా చూసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పచ్చని పొలాల మధ్య శివాలయం ఉండడం వచ్చిన భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. పురాతన శివాలయం ఉందని తనకు చాలా లేటుగా తెలిసిందని చెప్పారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ – 2 చిత్రం బ్లాక్ బ్లస్టర్ అయిందని, సనాతన ధర్మం గురించి సినిమాలో చక్కగా తెరపై చూపించానని, ప్రతి హిందూ బంధువు తప్పకుండా సినిమాను వీక్షించాలని కోరారు. మరల సమయం చూసుకొని కుటుంబ సభ్యులతో శివాలయానికి వస్తానని బోయపాటి శ్రీను తెలియజేశారు. పూజల అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, బోయపాటి శ్రీనుకు శివలింగం గల చిత్రపటాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు, బోయపాటి శ్రీను ను చూడగానే ఆయనతో సెల్ఫీలు దిగి ముచ్చటపడ్డారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన అర్చకుడు సాయి శివ, ప్రమోద్, జనరల్ సెక్రెటరీ జనార్ధన్, అన్నదాన సత్రం చైర్మన్ దర్శన్ గౌడ్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
