కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు..
తాడిచర్ల బ్లాక్-2 కేటాయింపుపై కృతజ్ఞతలు, కార్మికుల డిమాండ్లపై విజ్ఞప్తి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. గోదావరిఖని, తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్‌లను వేలం పాటకు వెళ్లకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని, 12వ వేజ్ బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు.
సింగరేణిలో నిర్వహించిన “భరోసా యాత్ర” సందర్భంగా ఆర్జీ-1 ఏరియా ఓసీపీ-5కు విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికే కేటాయించాలని, 12వ వేజ్ బోర్డు ఒప్పంద ప్రక్రియ ప్రారంభించేందుకు వెంటనే వేతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నాలుగు లేబర్ కోడ్‌లతో సంబంధం లేకుండా గతంలో మాదిరిగానే 12వ వేజ్ బోర్డు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా తాడిచర్ల బ్లాక్-2ను సింగరేణికి కేటాయించినందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
