నివారణ చర్యలను పాటిస్తూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలి…………….. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి. వి రజని
సాక్షిత వనపర్తి
అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెవిన్యూ డివిజనల్ ఆఫీసులో వనపర్తి జిల్లాలోని ఆటో యూనియన్ సభ్యులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ మరియు అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ నివారణ మరియు నియంత్రణ చట్టం, 2017 గురించి తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హెచ్ఐవి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మరియు ఎయిడ్స్ కంట్రోలర్ ఆఫీసర్ బండారు శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్ఐవి ఏ విధంగా సోకుతుందో అవగాహన కల్పించారు అదేవిధంగా ప్రభుత్వాసుపత్రిలో హెచ్ఐవికి సంబంధించిన వార్డు వివరాలని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన హెచ్ఐవి నిర్మూలించవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం రఘు, అడ్వకేట్స్ ధారా వెంకటేష్ మరియు ఎం ఆంజనేయులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
