ప్రజలకు సూచన – దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్త!
దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, OTPలు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారు.
హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగింది.
మోసగాళ్ల విధానం:
నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.
వాట్సాప్, SMS, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.
గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం.
ప్రజలకు సూచనలు:
ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయండి.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు.
ఎవరికీ బ్యాంక్ వివరాలు, OTP, యూపీఐ పిన్‌లు పంచుకోవద్దు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “Cash on Delivery (CoD)” సదుపాయాన్ని వినియోగించండి.
ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
“మోసపోకుండా జాగ్రత్త — అవగాహనే రక్షణ.”
సైబర్ నేరాల నుండి రక్షణ కోసం:
📞 1930 | 🌐 www.cybercrime.gov.in
– సుధీర్ రమ్నాథ్ కేకన్, ఐపీఎస్
జిల్లా పోలీసు అధికారి, మహబూబాబాద్

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
