ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా,
అభిమానాన్ని వమ్ము కానివ్వకుండా,
మరింత బాధ్యతతో,
మరింత కట్టుబాటుతో పనిచేస్తాం.
— నేనావత్ బాలు నాయక్ .
దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో RDO రమణా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రకమంలో పాల్గొని,మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు కి, వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ కి, కౌన్సిలర్ లకు పుష్పగుచ్ఛం అందజేసి,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .
ఈ సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి బలమైన నాయకత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు.
నూతన ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో దేవరకొండ పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో RDO రమణ రెడ్డి , నూతన పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY