ఉమా రాణికి కన్నీరుమున్నీరుగా తుది వీడ్కోలు…
కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం, . రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ సోదరుడు ధర్మేందర్ సింగ్ సతీమణి ఉమా రాణి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు తుది వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఉమా రాణి పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఉమా రాణి మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
