ప్రజలతో మాట్లాడి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కోవూరు ఎం.ఎల్.ఎ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో అర్జీ దారులు సంతృప్తి చెందేలా అధికారులు చొరవ చూపాలని కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రమైన కోవూరులోని తహసిల్దార్ కార్యాలయం లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారాన్ని నిర్ణీత గడువు లోపల పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అర్జీదారులుసంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించి వివరాలను వారికితెలియజేయాలన్నారు.ఈకార్యక్రమంలో.కోవూరు తహసిల్దార్ సుబ్బయ్య, ఎంపిడివో శ్రీహరి, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
