మంథనిలో క్రీడా, సంగీత విద్యకు కొత్త ఊపు
విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించాలి….
వచ్చే విద్యా సంవత్సరానికే సంగీత పాఠశాల ప్రారంభం….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: మంథని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడా, సంగీత విద్యా వసతులను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి సంగీత పాఠశాల ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేయాలని సూచించారు.
ఆదివారం మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో ఉన్న ఎంపీపీ ఎస్ పాఠశాల, పాఠశాల క్రీడా మైదానం, సంగీత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మంథని మున్సిపల్ పరిధిలోని రావులచెరువు, అయ్యగారి చెరువులను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గంగపురి ఎంపీపీ ఎస్ పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
సంగీత పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
అనంతరం రావులచెరువు, అయ్యగారి చెరువులను పరిశీలించిన కలెక్టర్, రావులచెరువు సమీపంలో ప్రజల రాకపోకలకు అనుకూలంగా రహదారి విస్తరణ

