పెళ్లి బట్టల కోసం వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

Sakshitha news

పెళ్లి బట్టల కోసం వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

సాక్షిత : పెళ్లి బట్టల కోసం వచ్చి వ్యక్తి మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. కుక్కునూరు మండలం సీతారాంపు రానికి చెందిన సన్నేపల్లి సుబ్బారావు తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో కుటుంబీకులకు బట్టలు కొనుగోలు చేసేందుకు బైక్ పై అశ్వారావుపేట వచ్చాడు. బట్టలు కొని తిరిగి వెళుతుండగా తిమ్మాపురం సమీపంలో అదుపుతప్పి కింద పడగా గాయాలయ్యాయి. అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు