నిజాంపేట్ లో గుప్పుమంటున్న గంజాయి- మత్తులో యువత గ్యాంగ్ వార్
*పెడదారి పడుతోన్నా యువత
*గంజాయిని నిషేధించాలని గళమెత్తిన స్థానికులు
*గంజాయి కేసులో పట్టుబడితే… సామాజిక బహిష్కరణ చెయ్యాలని తీర్మానం
*గంజాయి అమ్మినా… సేవించినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామచంద్ర నాయక్
సాక్షిత న్యూస్, నిజాంపేట్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో ప్రతి రాత్రి రణరంగమే కనిపిస్తోంది. గంజాయి మత్తులో యువత స్థానికులను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.
గుంపులు గుంపులుగా గంజాయి సేవిస్తూ… మత్తులో ఎదుటి వారిపై దాడులకు పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర నాయక్ అన్నారు.
గల్లి గల్లిలో బెల్టు షాపులతో పాటు… గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆయన తెలిపారు.
రాత్రి ఏడు గంటల సమయం దాటితే… స్త్రీలు గాని ఆడపిల్లలు గాని భయపడుతున్నారు.
గతంలో కూడా అనేక మైనటువంటి కేసులు ఉన్నాయని…అనేక మందికి కత్తిపోట్లు జరిగాయాని…ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా పట్టించే నాధుడు లేడని రామచంద్ర నాయక్ విమర్శించారు.
చట్టం చూపుల వరకేనా పోలీసులు… కేసుల వారికి పరిమితమా? కేసులు ఏమైనా ఉన్నాయా లేవా? అని ప్రశ్నించారు.
గంజాయి సేవించి గొడవ చేసే వారిని…ఎవరైనా ప్రశ్నిస్తే మీ అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా… మీ ఫ్యామిలీని ఖతం చేస్తామని స్థానికులను భయపెడుతున్నారు.
ఇంతకు బరితెగిస్తున్న వారి తల్లిదండ్రులు గాని వారి శ్రేయోభిలాషులు గాని వారికి అడ్డు చెప్పేవాడే లేడు?
కేసులు పెట్టిన సాయంకాలం వరకు ఎత్తియడమే జరుగుతుంది అన్నారు.
యువత తప్పుదారి పట్టడానికి ఎవరు కారకులు?
అమాయకులు బలై పోతే వారి కుటుంబం ఏమైపోవాలి ఒకసారి సమాజం ఆలోచన చేయాలని…
ఇప్పటికైనా అధికార యంత్రాంగం, పోలీసులు, న్యాయ వ్యవస్థ గంజాయిని అరికట్టెందుకు తగు చర్యలు తీసుకొని… గంజాయిని అరికట్టి… యువత భవిష్యత్తును కాపాడి… సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని రామచంద్ర నాయక్ కోరారు.


SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
