మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం

Sakshitha news

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం

23 జనవరి, ఉదయం 10:00 గంటలకు
మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,
వారి సతీమణి శ్రీమతి సుధా దేవ్ వర్మ విచ్చేయనున్నారు.

దర్శనం అనంతరం, గుడికి సమీపంలోని గ్రౌండ్‌లో —

  • రూ.150 కోట్ల వ్యయంతో మంజూరైన హుజూర్‌నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల
  • రూ.50 కోట్ల వ్యయంతో మంజూరైన కోదాడ జవహర్ నవోదయ విద్యాలయం

ఈ రెండు సంస్థల శిలాఫలకాలను గవర్నర్ ఆవిష్కరించి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమానికి
రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,
కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి
హాజరుకానున్నారు.

కావున మునగాల మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచ్లు , ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, అందరూ
గవర్నర్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నాము.

మీ,
కొప్పుల జైపాల్ రెడ్డి రెడ్డి
అధ్యక్షులు,
మునగాల మండల కాంగ్రెస్ పార్టీ.