జిడికె 11వ ఇంక్లైన్ పిట్ ఇంజనీర్ రాందాస్‌కు ఘన వీడ్కోలు…
పదవీ విరమణ సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో సన్మానం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జిడికె 11వ ఇంక్లైన్‌లో పిట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన శ్రీ రాందాస్ పదవీ విరమణ పొందిన సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో గని పై ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను రాందాస్ దంపతులకు పూల బొకే అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.
రాందాస్ సింగరేణి సంస్థకు అందించిన సేవలను కొనియాడిన నాయకులు, ఆయన ఉద్యోగ జీవితంలో అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. సుదీర్ఘకాలం సంస్థ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గని అధికారులతో పాటు ఏఐటియుసి నాయకులు సిద్దమల్ల రాజు, నాయిని శంకర్, గొడిశల నరేష్, జాన్ కెనడీ, జక్కుల శ్రీనివాస్, పర్లపెల్లి రామస్వామి తదితరులు పాల్గొని రాందాస్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
