రామగుండం అభివృద్ధిపై సమగ్ర సమీక్ష….

Sakshitha news

రామగుండం అభివృద్ధిపై సమగ్ర సమీక్ష….

సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు పట్టాల మంజూరుపై ప్రత్యేక చర్చ….

–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం: రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు వైఎస్సార్ పట్టాల మంజూరు అంశంపై చర్చించి, అర్హులైన ప్రజలకు పట్టాలు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అలాగే నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులను కోరారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జల్ద అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి జీఎం, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top