ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సహాయం

Sakshitha news

ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 17 మంది విద్యార్థులకు దాదాపు 7 లక్ష రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, విద్యే భవిష్యత్తుకు బాటలు వేసే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన విద్యార్థులకు BLR చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది అని ఆయన అన్నారు.

వైద్య విద్య అభ్యసిస్తూ భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ విద్యార్థులు బండారి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top