ముత్తంగిలో ముగ్గుల పోటీలకు హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

Sakshitha news

ముత్తంగిలో ముగ్గుల పోటీలకు హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సీనియర్ నాయకులు ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి.. అత్యుత్తమ ముగ్గులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి ఎం ఆర్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల ఆబేద్ ను అభినందించారు. బహుమతులు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top