మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన తోటకూర వజ్రేష్ యాదవ్ ని బోడుప్పల్ లోని ఆయన నివాసంలో
కాంగ్రెస్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుండి కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్
ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులతో కలిసి డిసిసి అధ్యక్షులుగా నియమితులైన తోటకూర వజ్రేష్ యాదవ్ ని కలిశారు.
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుడిగా వజ్రేష్ యాదవ్ ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె జయరాం, మాజీ కార్పొరేటర్లు నేను కూడా శ్రీనివాసరెడ్డి, ఆగం పాండు, యువజన కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, కూన రాఘవేంద్ర గౌడ్, చౌడ శ్రీనివాస్, మోతే శ్రీనివాస్ యాదవ్, షాకీర్, రమేష్ మంజుల్కర్, యాము సాగర్, డాన్ శీను, తోఫిక్, కుమార్ యాదవ్, పులి సందీప్, శరత్, మౌనిష్ యాదవ్, నర్సింగరావు, మురళి, కృష్ణ యాదవ్, వీరబాబు, అఖిల్ గౌడ్, రాజిరెడ్డి, లింగంపేట్, వెంకటేష్, మల్లం శ్రీను, తోకల శ్రీను, బాలప్ప, ప్రభాకర్ రెడ్డి, చోటు, అరుణ్, శ్రావణ్, భూషణం గౌడ్, భరత్, పూలమ్మ, లక్ష్మి మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

