GHMC పరిధిలో ఇటీవల ప్రకటించిన డివిజన్ల పునర్విభజన

Sakshitha news

GHMC పరిధిలో ఇటీవల ప్రకటించిన డివిజన్ల పునర్విభజన లో నెలకొన్న సమస్యలు మరియు పరిష్కరించాల్సిన చర్యల పై , వార్డుల పునర్విభజనలో మార్పులు ,చేర్పుల గురించి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , GHMC కమిషనర్ RV కర్ణన్ ను GHMC ప్రధాన కార్యలయంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ , దానం నాగేందర్ , ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ ,శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , మరియు ఇతర కార్పొరేటర్ల తో కలిసి వినతిపత్రం సమర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం GHMC పరిధిలో 300 డివిజన్లను ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయం అని, ప్రజలకు సుపరిపాలన, పరిపాలన సౌలభ్యం కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. కానీ కొన్ని డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకోని పరిష్కరించాలని, ప్రజల నుండి వచ్చే వినతులను పరిగణలోకి తీసుకొని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని, అందరికి ఆమోదయోగ్యమైన డివిజన్లను ఏర్పాటు చేయాలని, ప్రజల నుండి, కాలనీ వాసుల నుండి వచ్చే ప్రతి వినతి పత్రం ను పరిగణలోకి తీసుకోవాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి డివిజన్ల రూపకల్పన చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

Scroll to Top