రెండు ఏళ్ళల్లో ఉమ్మడి జిల్లాకు మంత్రి జూపల్లి

Sakshitha news

రెండు ఏళ్ళల్లో ఉమ్మడి జిల్లాకు మంత్రి జూపల్లి
నియోజకవర్గానికి ఎమ్మెల్యే మెగాహారెడ్డిలు చేసిందేమిటో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల,మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాట్ విమర్శ

గ్రామాలలో నియంత పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లకు పిలుపు

సాక్షిత వనపర్తి : రాష్ట్రంలో అబద్ధపు హామీలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని అలాగే ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన జూపల్లి కృష్ణారావు రెండేళ్లు పూర్తవుతున్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసింది ఏమీటో చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు అలాగే వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్న మెగా రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఇచ్చిన హామీలను అమలుపరచ లేక అభివృద్ధి చేయలేక నిత్యం బి ఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారని గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగున్న రైళ్లు మంత్రి పదవి అనుభవించిన జూపల్లి అప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించారని నేడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి పొంది కేసీఆర్ను తిడుతున్నారని రేపు రేవంత్ రెడ్డి ని కూడా తిడతారని అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పదవులు ఇచ్చిన ప్రభుత్వాలను నాయకులను తిడతారనిఇది జూపల్లి నైజం అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , అలాగే గడిచిన రెండేళ్లలో వనపర్తి నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు చెప్పడం చేతకాని ఎమ్మెల్యే మెగా రెడ్డి బిఆర్ఎస్ నాయకుల లాగుల్లో తొండలు విడుస్తామని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో విమర్శించడం సిగ్గుచేటని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అడ్డాకల్ మండలం బలిపల్లి కన్ననూరు చిన్న మునగాలచేడు పెద్ద మునగాలు చెడు పొన్నకల్ పానగల్ మండలం గోపులాపురం తదితర గ్రామాల అభ్యర్థులు తరపున నిర్వహించిన ప్రచారంలో ఘాటుగా విమర్శించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కుంటుపడిందని రైతులకు సాగు త్రాగునీరు కరెంటు ధాన్యానికి బోనస్ లేక రైతులు అప్పలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాలను పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ ది అని సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే తెలంగాణ ప్రతిష్టను నిలబెడితే సంక్షేమ పథకాలు కత్తెర వేసిన ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను వారు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై నిలదీయాలని కోరారు గ్రామాలలో నడుస్తున్న నియంత పాలనను ఓటర్లు తమ ఓట్ల ద్వారా బదులిచ్చి నీ అంత పాలనకు చరమగీతం పాడి రాబోయే కేసీఆర్ ప్రభుత్వానికి స్వాగతం పలకాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీపీ దయాకర్ నాయకులు దామోదర్ రెడ్డి శ్రీధర్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ మాజీ గొర్రెల పెంపకం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్ మార్క్ పేడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఉంగరం తిరుమల్ వేణుగోపాల్ బండారు కృష్ణ గులాం ఖాదర్ ఖాన్ ప్రేమ్ నాథ్ రెడ్డి బొబ్బిలి ప్రేమ్ కుమార్ సుధాకర్ వెంకటేష్ గౌడ్ స్టార్ రహీం ఇమ్రాన్ జోహాబ్ హుస్సేన్ ఆరిఫ్ డాక్టర్ డానియల్ పెద్ద ముక్కల రవి నందిమల్ల సుబ్బు మండ్ల రాము సూర్యవంశం ముని కుమార్ అనపర్తి రాము గ్రీన్ యాడ్స్ యూసుఫ్ అలీ నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top