మందుల నాగయ్యని గెలిపించాలంటూ గ్రామంలో భారీ ర్యాలీ
రేంచి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థన…..
సాక్షిత కోదాడ ప్రతినిధి : కోదాడ మండలం గుడిబండ
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మందుల నాగయ్య అన్నారు. గ్రామములో పెద్ద ఎత్తున వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ గుడిబండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మందుల నాగయ్య అనే నేను పోటీ చేస్తున్నాను ఎన్నికల గుర్తు రేంచి పై గ్రామ ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల ,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు తన గుర్తు రేంచి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే రఫీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
