మేడ్చల్‌లో సబ్ రిజిస్ట్రార్,తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటు పరిశీలన
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్‌లో సబ్ రిజిస్ట్రార్ మరియు తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన పరిశీలన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు.ప్రజలకు పారదర్శకమైన,వేగవంతమైన సేవలు అందేలా కార్యాలయాల ఏర్పాటులో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సాధారణ ప్రజలు ఒకేచోట అన్ని ప్రభుత్వ సేవలు పొందే విధంగా కార్యాలయాల రూపకల్పన అవసరమని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రమణ రెడ్డి,వర్ధా రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ రమేష్ యాదవ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మాజీ కౌన్సిలర్లు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
