మెడికల్స్ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని కమర్షియల్ ట్యాక్స్ కాంప్లెక్స్ చిత్తూరు డివిజన్ కార్యాలయంలో డ్రగ్స్ అండ్ మెడికల్స్ హోల్‌సేలర్లు, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పన్నులశాఖ చిత్తూరు డివిజన్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇటీవలి జీఎస్టీ రేటు తగ్గింపులు, వాటి అమలుతో పాటు కంపోజిషన్ పన్ను చెల్లింపుదారులు రెగ్యులర్ పన్ను చెల్లింపుదారులుగా మారాల్సిన అవసరంపై సూచనలు చేశారు.
సమావేశంలో డీలర్లు ప్రతి ఇన్వాయిస్‌లో జీఎస్టీ రేటు తగ్గింపుతో లభించిన ప్రయోజనాన్ని స్పష్టంగా చూపించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, కంపోజిషన్ డీలర్లను రెగ్యులర్ కేటగిరీకి మార్చడం, ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించడం, అవసరమైన రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. అన్ని శాసనబద్ధ రిటర్నులను సమయానికి దాఖలు చేయడం విషయాలపై అంగీకారం తెలిపారు.
అలాగే జీఎస్టీ 2.0 అమలు ప్రక్రియలో భాగంగా వినియోగదారులకు అందాల్సిన జీఎస్టీ ప్రయోజనాలను సక్రమంగా పాస్‌ఆన్ చేయనట్లయితే సంబంధించిన పన్ను చెల్లింపుదారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్బరామ గుప్తా, ప్రతినిధులు నరసింహరెడ్డి, కుమార్, శశి, శివ, మెడికల్స్ అండ్ డ్రగ్స్ వర్గానికి చెందిన పలువురు పన్ను చెల్లింపుదారులు పాల్గొన్నారు.
తిరుపతి అసిస్టెంట్ కమిషనర్లు ప్రసాద్ రెడ్డి, తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
