టీపీసీసీ డాక్టర్ సెల్ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు.
రాష్ట్ర వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీలతో పాటు ఐదు జిల్లాల చైర్మన్లను మరియు ఇతర కీలక పదవులకు సంబంధించిన నియామక పత్రాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందచేశారు. మిగతా జిల్లా & రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాలను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు టీపీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ డా. రాజీవ్ తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ
- ఏళ్ల తరబడి బీద ప్రజలని సేవలు అందిస్తున్న డాక్టర్స్ కి శుభాభినందనలు
- డాక్టర్ కి సమాజంలో ప్రత్యేక స్థానం
- నేను కూడా డాక్టర్ కావాలని అనుకున్నాను. పరిస్థితుల వల్ల కాలేకపోయా
- నేటి సమాజంలో డాక్టర్ వృత్తికి ప్రయారిటీ
- చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో కి వస్తే క్వాలిటీ డెవలప్మెంట్ తయారవుతుంది
- డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఒక రూపాయి డాక్టర్ గా ఫేమస్
- డాక్టర్స్ కి ప్రజలకి సేవ చేసుకునే అవకాశం
- గత ప్రభుత్వం వైద్యరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య మెరుగు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు.
- ప్రభుత్వ నిర్ణయాలను మెచ్చుకొని ఇంత మంది డాక్టర్లు కాంగ్రెస్ కుటుంబంలో భాగం కావడం సంతోషంగా ఉందని పీసీసీ చీఫ్ తెలిపారు.
- సమాజంలో డాక్టర్ల పాత్ర గొప్పదని, రోగాన్ని నయం చేయడంతో పాటు సమాజంలో ఉన్న సమస్యలను తొలగించడంలో డాక్టర్లు భాగం కావాలని మహేష్ గౌడ్ కోరారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు.
- డాక్టర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ
- మెడికల్ & హెల్త్ విభాగం కమిటీల నియామకాలు, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి నిర్ణయమని, వైద్య రంగంలో నిర్మాణాత్మక ఆలోచనలతో పనిచేయడానికి అవకాశమిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
- సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సలహాలు, సూచనలతో వైద్య రంగంలోని అన్ని విభాగాల సిబ్బంది సంక్షేమం కోసం త్వరలోనే ప్రణాళిక రూపొందిస్తామని డాక్టర్ సెల్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
