మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్..

Sakshitha news

మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్..
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి సందర్భంగా చిట్కుల్ లోనీ నీలం నివాసంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు ఫూలే అని అన్నారు, మహిళా విద్య, బడుగు వర్గాల అభ్యునత్తి కోసం ఫూలే దంపతులు స్థాపించిన సత్యశోధక్ సమాజ్ వల్ల సమాజంలో ఉన్న అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు కారణమైంది అన్నారు, ఆయన చూపిన బాట సమాజనికి అనుసరణీయం అని నీలం మధు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్జు, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top