బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఎమ్మెల్యే ముఠా గోపాల్ , కార్పొరేటర్ రవి చారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం , మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తున్నాం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం , కవాడిగూడ NTPC వద్ద ఏర్పాటు చేస్తున్నాం..
ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నాం
ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం ,భోజనం అందించడం జరుగుతుంది..
దీని ద్వారా హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రో పాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
